గత కొన్నాళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌ వంటి తీవ్ర వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొందరు వ్యక్తులు పలువు స్టార్ హీరోలు, సినీ పెద్దలను ఈ వివాదాల్లో టార్గెట్ చేసి మాట్లాడటంతో టీవీ ఛానెళ్లలో ఎడతెరిపిలేని డిబేట్లు, వాదోపవాదాలు, బహిరంగ నిరసనలు, పోలీస్ కంప్లైంట్లు వంటి పరిణామాలు తెలెత్తాయి. పరిశ్రమలోని పెద్దల నడుమ పరిష్కారం అవ్వాల్సిన సమస్యలన్నీ బహిర్గతమై చిత్ర పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
అందుకే ఇలాంటి పరిణామాలు మళ్ళీ మళ్ళీ చోటు చేసుకోకుండా ఉండేందుకు పరిశ్రమలోని పెద్దలందరూ కలిసి వివిధ కొంతమంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇండస్ట్రీలోని పలు అసోషియేషన్ల సభ్యులకు స్థానం కల్పించారు.
ఇకపై పరిశ్రమలోని ఏ విభాగం గురించైనా ఒక అంశంపై అధికారికంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ కమిటీలోని సభ్యులు పరిశ్రమ పక్షాన అధికారిక ప్రతినిధులుగా మాట్లాడతారని పరిశ్రమ తెలిపింది. కమిటీలోని ఆయా సభ్యుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.



