
వివాదాస్పద సెన్సార్ అధికారిణి ధనలక్ష్మి బదిలీ తర్వాత ఆ స్థానంలో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త అధికారి వచ్చారు. విజయ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారిగా సెంట్రల్ బోర్డ్ అఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నియమించింది. సెన్సార్ అధికారిగా భాద్యతలు చేపట్టక ముందు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో డైరెక్టర్ గా విజయ్ కుమార్ రెడ్డి వర్క్ చేశారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS) 1990వ బ్యాచ్ చెందిన విజయ్ కుమార్ రెడ్డి గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ విభాగంలో అనేక కీలకమైన ఉన్నత పదవులు నిర్వర్తించారు. విజయ్ కుమార్ రెడ్డి రాకతో టాలీవుడ్ లో ఎటువంటి అభివృద్ధి, మార్పులు జరుగుతాయో వేచి చూద్దాం.

