వరుస ప్లాప్ లతో షాక్ కి గురైన టాలీవుడ్.

వరుస ప్లాప్ లతో షాక్ కి గురైన టాలీవుడ్.

Published on Sep 26, 2014 8:00 AM IST

TFI
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు కొంత నిరాశజనక పరిస్థితిలో వెళ్తుంది. భారి బడ్జెట్ సినిమాకు వరుసగా పరాజయం పాలవడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్ లకు షాక్ కొట్టినట్టు అయ్యింది.

అతి తక్కువ సమయంలో ‘సికందర్’, ‘రభస’, ‘ఆగడు’ వంటి సినిమాలు బడ్జెట్ ను రికవర్ చేయలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద అనుకున్న పలితాలను సాదించలేకపోయాయి. ఈ సినిమాలు భారి నష్టాలను కలిగించాయి. ఈ సినిమాల పరాజయంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా ప్రతికూల పరిస్తితులను ఎదుర్కున్నారు. ఆర్ధికంగా నష్టపోతున్నారు.

చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు 70 శాతం వరకు తమ డబ్బులను పోగొట్టుకున్నారు. అతి తక్కువ సమయంలో చాలా భారి మొత్తంలో డబ్బులు లాస్ అవ్వడం వలన ఇండస్ట్రీ ప్రముఖులు, పెద్దలు ఒక పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారు.

ప్రస్తుతం అందరి చూపు ‘లౌక్యం’, ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలపై ఉంది. ఈ సినిమాలయినా లాభాలను తీసుకోస్తాయో..? లేదో..?

తాజా వార్తలు