ఇండియన్ సినిమా దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన ‘వాలిమై’.!

Published on Jun 30, 2021 9:00 am IST

ముఖ్యంగా మన ఇండియన్ సినిమా దగ్గర పర్టిక్యులర్ కొంతమంది స్టార్ హీరోల అభిమానులు తలుచుకుంటే వారి హీరో పేరిట చెరగని రికార్డులనే సెట్ చేసి పడేస్తారు. అలాంటి అభిమానం తమ హీరోలపై చూపిస్తారు. అది వాళ్ళ ప్రేమ అంతే.. మరి అలాగే కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ అభిమానులు కూడా అజిత్ పేరిట ఇండియన్ సినిమా హిస్టరీ గుర్తుండిపోయే చెరగని రికార్డ్ ను ఇప్పుడు సెట్ చేసి పెట్టేసారు.

కొన్ని రోజుల కితమే అజిత్ కొత్త సినిమా “వాలిమై” బుక్ మై షో ఇంట్రెస్ట్స్ లో 7 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ తో “కేజీయఫ్ 2″ని దాటేసింది అని విన్నాము.. కానీ రీసెంట్ గా అది 1 మిలియన్ మార్క్ ని అది కూడా ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యకుండా దాటేయడం నిజంగా హిస్టరీనే.. అయితే మన దగ్గర ఈ 1 మిలియన్ ఇంట్రెస్ట్స్ అనేది ఒక్క “బాహుబలి 2” కే దక్కింది. అది కూడా రిలీజ్ టైం కి నమోదు అయ్యింది. కానీ అజిత్ సినిమా విషయంలో మాత్రం ముందే జరగడం గమనార్హం.

సంబంధిత సమాచారం :