థలా అజిత్ “వాలిమై” టార్గెట్ అప్పటికే ఫిక్స్.?

Published on May 30, 2021 5:03 pm IST

ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ కూడా పాన్ ఇండియన్ వైడ్ అడుగులు వేస్తుంది. మరి అలా విజయ్ తన లాస్ట్ చిత్రం “మాస్టర్” అన్ని దేశీయ భాషల్లో విడుదల చేసి నార్మల్ సినిమాని పాన్ ఇండియన్ రిలీజ్ చేసాడు. మరి విజయ్ తో పాటుగా అంతే స్టార్డం ఉన్న థలా అజిత్ చేస్తున్న నెక్స్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ “వాలిమై” కూడా బాలీవుడ్ స్టార్ నిర్మాత బోనీ కపూర్ నేతృత్వంలో పాన్ ఇండియన్ లెవెల్లోనే విడుదలకు సన్నద్ధం అవుతుంది.

అయితే ఇప్పటికే చాలా మేర షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా ఇంకా విడుదల కాలేదు కానీ ఈ చిత్రం విడుదలపై స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ దీవాళీ రేస్ లో ఉంచాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ను హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :