తలైవర్ “అన్నాత్తే” ఇక్కడ స్టార్ట్ కానుంది.!

Published on Mar 11, 2021 9:06 pm IST

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొన్నాళ్ల నుంచి రజినీకు తన రేంజ్ హిట్ వస్తే చూడాలని ఇండియన్ వైడ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ అవి మాత్రం రావడం లేదు. అయినప్పటికీ తాను ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తే దాని హైప్ వచ్చేస్తుంది. అలా తలైవర్ టేకప్ చేసిన మరో ప్రాజెక్ట్ “అన్నాత్తే”.

అక్కడి స్టార్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కరోనా లేకుండా ఉంటే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రం మరింత లేట్ అయ్యింది. పైగా మధ్యలో రజినీ ఆరోగ్యం క్షీణించడం షూట్ కు మరింత దెబ్బేసింది. కానీ ఫైనల్ గా మేకర్స్ మళ్ళీ షూట్ కు రంగం సిద్ధం చేశారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా అప్డేట్ పై సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా తాలూకా షూట్ చెన్నై లోని ఎంజిఆర్ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి డి ఇమన్ సంగీతం అందిస్తుండగా “రోబో” ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :