తన రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తలైవర్.!

Published on May 13, 2021 3:45 pm IST

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా అక్కడి స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం తాలుకా కీలక షెడ్యూల్ ని మేకర్స్ నిన్ననే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మరి ఆ షూట్ లో పాల్గొన్న రజినీ నిన్ననే ఇక్కడ నుంచి చెన్నై బయల్దేరి కూడా వెళ్లిపోయారు.

మరి అలా వెళ్లిన తలైవర్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన కోవిడ్ రెండో డోస్ టీకాను ఈరోజు వేయించేసుకున్నారు. గత కొన్నాళ్ల కితమే ఫస్ట్ డోస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే. అందుకే ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఆల్రెడీ తమ టీకా తీసుకున్నారు. ఇక రజినీ నటిస్తున్న ఈ చిత్రానికి ఇమన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :