ఆ సినిమా ‘కె.జి.ఎఫ్’ను మరిపించేలా ఉంటుందట !

ఆ సినిమా ‘కె.జి.ఎఫ్’ను మరిపించేలా ఉంటుందట !

Published on Feb 24, 2021 6:07 PM IST

యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్’ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులు అంతగా ఆదరించడానికి కారణం అందులోని మాస్ ఎలివేషన్స్. ప్రతి సన్నివేశం హీరో పాత్రకు ఒక ఎలివేషనే అనేట్టు ఉంటుంది సినిమా. ఇక పోరాట సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనే లేదు. పదుల సంఖ్యలో రౌడీలను, గూండాలను హీరో రాఖీ భాయ్ చిత్తు చేస్తుంటే కళ్లప్పగించి చూశారంతా. అందుకే ఫైట్స్ ఎలా ఉండాలి అంటే ‘కె.జి.ఎఫ్’ లెవల్లో ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ పడిపోయింది.

అయితే పోరాట సన్నివేశాల్లో ఈ సినిమాను మరిపించేలా ఉండబోతుందట ఒక చిత్రం. అదే స్టార్ హీరో విజయ్ యొక్క 65వ సినిమా. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ‘కె.జి.ఎఫ్ 1,2’ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన స్టంట్ మాస్టర్స్ అన్బ్, ఆరివుమణి బృందంలోని ఐలీప్ కుమార్ స్టంట్స్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలోని ఫైట్స్ చూస్తే ‘కె.జి.ఎఫ్’ను మర్చిపోతారని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విజయ్ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ‘కె.జి.ఎఫ్’ను మించేలా అంటే ఎలా ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు