ఓట్ వేసేందుకు సైకిల్ పై వచ్చిన థలపతి విజయ్.!

Published on Apr 6, 2021 11:00 am IST

ప్రస్తుతం తమిళ నాట సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే రసవత్తరంగా ప్రచారం జరిగిన ఈ ఎన్నికల్లో మొట్ట మొదటి సరిగా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా పోటీ చేసారు. మరి దీనితో తమిళ నాట్ స్టార్ హీరోలు అందరు తమ కుటుంబాలతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాగా థలపతి విజయ్ మాత్రం కాస్త డిఫరెంట్ గా సైకిల్ మీద ఎలక్షన్ సెంటర్ దగ్గరకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

ఇపుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. వెనుక వేలాది మంది అభిమానులు బైకులు మీద తరలి వస్తుండగా విజయ్ శరవేగంగా సైకిల్ తొక్కుతూ మధ్యలో అభిమానులను తప్పుకోమని జాగ్రత్తగా రావాలని సూచిస్తూ కనిపించాడు. మొత్తానికి మాత్రం విజయ్ ఓట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ అక్కడి స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన 65వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :