“భీమ్లా నాయక్ ఆల్ టైమ్ హై” అంటున్న థమన్!

Published on Aug 27, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో మరొక కీలక పాత్ర లో రానా దగ్గుపాటి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో, గ్లింప్స్ సినిమా పై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గత చిత్రాలతో పోల్చితే, ఏ సినిమా కి లేని విధంగా ఈ సినిమా పై హైప్ క్రియేట్ అయ్యింది అని చెప్పాలి.

ఈ చిత్రం నుండి విడుదల అయిన గ్లింప్స్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ను ప్రకటించినప్పటి నుండి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. భీమ్లా నాయక్ ఆల్ టైమ్ హై అంటూ థమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థమన్ ఫస్ట్ సింగిల్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు కావడం తో థమన్ బీట్ ఈ సారి వేరే లెవెల్ లో ఉంటాయి అంటూ ఫ్యాన్స్ సైతం చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :