“సర్కారు వారి పాట”పై హామీ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్.!

Published on Jun 16, 2021 9:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా ఉన్నాయి. మరి అలాగే ఈ చిత్రానికి మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఇప్పటి వరకు మహేష్ కి ఇచ్చిన సంగీతం అనుసారం దీనిపై కూడా గట్టి అంచనాలే ఉండడంతో థమన్ కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా వర్క్ చేస్తున్నాడు.

మరి మరోసారి థమన్ మహేష్ ఫ్యాన్స్ కి హామీ ఇస్తున్నాడు. సర్కారు వారి వారి పాట ఆల్బమ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ ఊహించిన దాని కంటే బిగ్ హిట్ అవుతాయని అలాగే తాము ముందు చెప్పినట్టుగానే ఈ కరోనా పరిస్థితులు చక్కబడ్డాక తాము ఇస్తామన్న అప్డేట్ కూడా ఇస్తామని హామీ కూడా ఇచ్చి.. సరికొత్త మిక్స్ ట్యూన్ ని కూడా అభిమానులు కోసం విడుదల చేసాడు. మరి మొత్తానికి మాత్రం మహేష్ ఫ్యాన్స్ కోసం సాలిడ్ ట్రీట్ రెడీ అవుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :