మహేష్ ‘ఆగడు’ కోసం పని మొదలు పెట్టిన థమన్

Published on Oct 28, 2013 8:42 am IST

S.Thaman-Image

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంబందించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే మొదలయ్యాయి. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి సందందించిన టైటిల్ ట్రాక్ కోసం అప్పుడే పని మొదలు పెట్టాడు.

మహేష్ బాబుకి థమన్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఇప్పటికే పబ్లిక్ గా పలు సందర్బాల్లో చాలా సార్లు థమన్ మ్యూజిక్ గురించి మెచ్చుకున్నారు. దాంతో ఆ ఆల్బమ్ స్పెషల్ గా ఉండాలని థమన్ మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు. తమన్నా హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు తెరకెక్కిస్తున్న ఆగడు సినిమా 2014 మేలో రిలీజ్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :