మహేష్ ‘ఆగడు’ – డబల్ హట్రిక్ కి తమన్ రెడీ..!

మహేష్ ‘ఆగడు’ – డబల్ హట్రిక్ కి తమన్ రెడీ..!

Published on Aug 4, 2014 2:25 PM IST

thaman
మహేష్ బాబుతో తమన్ చేస్తున్న హట్రిక్ మూవీ ‘ఆగడు’. గతంలో మహేష్ నటించిన ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’ సినిమాలకు తమన్ సంగీతం అందించారు. ‘ఆగడు’ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా. ఇది సంగీత దర్శకుడిగా తమన్ కు 50వ సినిమా. అందువల్ల తన కెరీర్లో ‘ఆగడు’ చాలా స్పెషల్ గా నిలవాలని తమన్ భావిస్తున్నారు.

ఆదివారంతో ‘ఆగడు’ మూవీ సాంగ్స్ కంపోజిషన్స్ పూర్తి చేశారు తమన్. మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ‘ఆగడు’ పాటలు చాలా బాగా వచ్చాయని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. మహేష్ తోనే కాదు, దర్శకుడు శ్రీను వైట్లతో కూడా తమన్ కు ‘ఆగడు’ హట్రిక్ మూవీ. త్వరలో ‘ఆగడు’ ఆడియో విడుదల తేదిను వెల్లడించనున్నారు.

తాజా వార్తలు