‘జై లవ కుశ’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ సినిమా కోసం వర్కవుట్స్ చేసి కొత్త లుక్ లోకి మారారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
చాలా రోజుల నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్న తమన్ ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ ట్యూన్స్ కంపోజ్ చేశారని చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. త్రివిక్రమ్ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ పరాజయంతో విమర్శలనెదుర్కున్న త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎలా రూపొందిస్తారో చూడాలని ప్రేక్షకులు కుతూహలంగా ఉన్నారు.


