బాలయ్య 111 గ్లింప్స్ ఓఎస్టి రిలీజ్ పై థమన్ క్లారిటీ!

బాలయ్య 111 గ్లింప్స్ ఓఎస్టి రిలీజ్ పై థమన్ క్లారిటీ!

Published on Jun 11, 2026 8:13 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 111వ సినిమా ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తో చేస్తున్న ఈ భారీ యాక్షన్ ఫీస్ట్ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే బాలయ్య పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్ సహా బాలయ్య స్టైలిష్ లుక్ ని కూడా విడుదల చేయడం ఫ్యాన్స్ లో కేజ్రీగా మారింది. అయితే ఈ గ్లింప్స్ కి థమన్ ఈసారి మరింత కొత్తగా బాలయ్య కోసం స్కోర్ ట్రై చేసి తనని ఎలివేట్ చేసాడు.

పైగా ఈ స్కోర్ తో ఇతర ఎడిట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీనితో ఈ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (ఓఎస్టి) రిలీజ్ పై థమన్ క్లారిటీ ఇచ్చాడు. నేడు జూన్ 11 రాత్రి 9 గంటల 9 నిమిషాలకి ఈ ట్రాక్ ని విడుదల చేస్తున్నట్టుగా టైం లాక్ చేసాడు. దీనితో ఈ ట్రాక్ కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు