మెగాస్టార్ “లూసిఫర్”ని భారీగానే చెక్కుతున్నారట.!

Published on May 30, 2021 8:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. మరి వాటిలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన “ఆచార్య” చిత్రం ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యిపోయింది. మరి ఈ సినిమా ఇంకా లైన్ లో ఉండగానే మెగాస్టార్ చిరు రెండు రీమేక్ సినిమాలు ఒప్పుకున్నారు.

వాటిలో మళయాళ బ్లాక్ బస్టర్ చిత్రం “లూసిఫర్” రీమేక్ కూడా ఒకటి. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న మోహన రాజా పుట్టినరోజు ఈరోజు కావడంతో కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి అనేక మంది సినీ తారలు తమ విషెష్ తెలియజేసారు.

అలా ఇపుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తన విషెష్ చెప్తూ మోహన రాజా లూసిఫర్ సినిమాలు ఎలా చెక్కుతున్నారో నాకు తెలుసనీ అలాగే ఆ చిత్రం ఎంత స్థాయిలోకి కూడా వెళ్తుందో తెలుసనీ చిన్న హింట్ ఇచ్చాడు. సో లూసిఫర్ చిత్రం మరో మెగా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :