మరోసారి పాటకోసం గొంతుకలిపిన రవితేజ

మరోసారి పాటకోసం గొంతుకలిపిన రవితేజ

Published on Jul 29, 2014 3:35 AM IST

taman ravi teja
మాస్ మహారాజ్ తన అభిమానులను సర్ప్రైజ్ చెయ్యడానికి రెడీగా వున్నాడు. తాను నటిస్తున్న ‘పవర్’ సినిమాలో ఒక ముఖ్యమైన పాటను తమన్ కష్టపడి రవితేజ చేత పాడించాడు. గతంలో రవి ‘బలుపు’ సినిమాలో కూడా పాట పాడిన సంగతి తెలిసినదే

బలుపు సినిమా రవితేజ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. దీనికోసం పవర్ సినిమాలో కూడా ఆ సెంటిమెంట్ ని కొనసాగించే పనిలో వున్నాడు. ప్రస్తుతం పవర్ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో వుంది. ఈ సినిమాకి
హన్సిక కధానాయిక

కె.ఎస్ రవీంద్ర దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత

తాజా వార్తలు