“వకీల్ సాబ్”కు టైం లేకుండా కష్టపడుతున్న థమన్.!

Published on Mar 31, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” ఇప్పుడు ఎంతటి సెన్సేషన్ ను నమోదు చేసిందో చూసాము. టాలీవుడ్ లోనే కాకుండా మన సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీతం అందించిన ఫ్యాన్ బాయ్ థమన్ పనికి కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి.

పాటలకు కానీ ట్రైలర్ లో తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంకా సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో టైం కూడా చూసుకోకుండా థమన్ కష్టపడుతున్నాడు. లేటెస్ట్ గానే తెల్లవారు మూడు గంటల దగ్గర సమయంలో వకీల్ సాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు చేస్తున్నట్టుగా తెలిపాడు. దర్శకుడు శ్రీరామ్ వేణుతో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నాడు. మొత్తానికి మాత్రం థమన్ పవన్ తో తమ మొదటి సినిమాకు ది బెస్ట్ ఇచ్చేందుకు గట్టిగా కష్టపడుతున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :