మరోసారి ఇంప్రెస్ చేసిన థమన్ !
Published on Feb 24, 2018 12:48 pm IST

సంగీత దర్శకుడు థమన్ ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటికే ‘భాగమతి, తొలిప్రేమ’ వంటి చిత్రాలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం పరంగా సూపర్ సక్సెస్ అవగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘ఛల్ మోహన్ రంగ’ పాట కూడ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది.

కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ ‘గ..ఘ.. మేఘ’ పాటకు థమన్ అందించిన ఫ్రెష్ ట్యూన్స్ వింటుంటే ఆడియో మొత్తం ఇలానే కొత్తగా ఉంటుందనే నమ్మకం కలుగుతోంది. థమన్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అన్ని పాటలను ఇలాంటి కొత్త తరహా సంగీతాన్నే ఇచ్చి ఉంటే సినిమా సగం విజయం సాధించినట్టే.

నితిన్, మేఘా ఆకాష్ లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయగా త్రివిక్రమ్ కథను అందించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పాట కొరకు క్లిక్ చేయండి

 
Like us on Facebook