పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా సూపర్ హిట్ ను సాధించిన విషయం తెలిసిందే .ఇప్పుడు ఈ చిత్రం ‘సింబా’గా హిందీలో రీమేక్ అవుతుంది .రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అదింస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.సారా అలీ ఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ అతిధి పాత్రలో మెరవనున్నారు. కరణ్ జోహార్, రోహిత్ శెట్టిలు కలిసి ఈసినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఒరిజినల్ వెర్షన్ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిగా చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.


