చిరంజీవి సినిమాపై మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన తమన్

Published on Jun 28, 2021 8:02 pm IST

మెగాస్టార్ చిరంజీవీ సైన్ చేసిన సినిమాల్లో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కూడ ఒకటి. మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేస్తున్న ‘ఆచార్య’ సినిమా దాదాపు పూర్తైనట్టే. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిపితే సినిమా పూర్తవుతుంది. అది పూర్తవ్వగానే చిరు ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్ మొదలుపెడతారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సినిమా మీద మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

షూటింగ్ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు టీమ్. చిత్ర సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కంపోజిషన్ మొదలుపెట్టేశారు. ‘ఇది మన మెగాస్టార్ చిరంజీవిగారి మీద ప్రేమ చూపించాల్సిన సమయం. అభిమానులకు తప్పకుండా హై ఇచ్చే స్టఫ్ ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. గత ఐదారేళ్లుగా తమన్ మ్యూజిక్ అందించిన చిత్రాలు సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. ‘వకీల్ సాబ్, అల వైకుంఠపురములో, క్రాక్, అరవింద సమేత’లు భారీ హిట్లుగా నిలిచాయి. ఆ చిత్రాల కోవలోనే మెగాస్టార్ సినిమా కూడ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు.

సంబంధిత సమాచారం :