
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్’. జూలై 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా కోసం నానక్రామ్ గూడాలో ఓ స్పెషల్ హౌస్ సెట్ ని వేసారు. ఇప్పుడు ఆ సెట్లోనే బాలకృష్ణపై కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం 12 కేజీల బరువు తగ్గి చాలా స్లిమ్ గా కనిపించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. బాలకృష్ణ సినిమాకి మొదటి సారి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తమన్ ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ వర్క్ ని స్టార్ట్ చెయ్యడమే కాకుండా ఫస్ట్ సాంగ్ ని కూడా ఫినిష్ చేసాడు. ‘డిక్టేటర్ సినిమా కోసం మొదటి సాంగ్ ని ఫినిష్ చేసాను. గణేశా అని సాగే ఈ సాంగ్ సూపర్బ్ గా వచ్చిందని’ తమన్ తెలిపాడు. త్వరలోనే ఈ చిత్ర టీం ఈ సాంగ్ ని షూట్ చేయనున్నారు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్. కోన వెంకట్ – గోపి మోహన్ – ఎం.రత్నం – శ్రీధర్ సీపాన కలిసి కథని అందించిన ఈ సినిమాని శ్రీవాస్ ఇరోస్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఉండేలా కథని రెడీ చేసారు.

