థమన్ మాస్ బీట్స్ “అఖండ” కోసమేనా?

Published on Aug 26, 2021 9:00 am IST


ప్రెజెంట్ మన టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఎస్ పేరు మంచి హాట్ టాపిక్. తన కెరీర్ లో ఎప్పుడూ చూడని హై లో థమన్ ఇపుడు ఉన్నాడు. ఒకదాన్ని మించి ఒక ఆల్బమ్ ఇస్తూ ఆల్ మోస్ట్ రానున్న చాలా సినిమాలకు తానే ఎంపిక అయ్యాడు. అందుకే థమన్ మ్యూజిక్ పై మంచి క్రేజ్ నెలకొంది.

మరి ఇదిలా ఉండగా థమన్ ఇస్తున్న ఆల్బమ్స్ లో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో నందమూరి నటసింహం నందమూరి బాలయ్య నటించిన “అఖండ” కూడా ఒకటి. ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్ కి ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫస్ట్ సింగిల్ పై చాలా అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు. మరి ఈ ఫస్ట్ సాంగ్ కూడా త్వరలోనే వస్తుంది అని థమన్ హింట్ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు తన గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణితో మాస్ డ్రమ్ సెషన్ లో పాల్గొన్నాడు పైగా అందులో సింహం కూడా కనిపిస్తుండంతో ఈ సెషన్ అఖండ కోసమే అయ్యుంటుందని నందమూరి అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :