యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నిన్నటితో సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ చేశారు తమన్. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్, తమన్ ల కెరీర్లో ‘పండగ చేస్కో’ ది బెస్ట్ ఆల్బం అవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు.
‘బలుపు’ ఫేం గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్ మరో హీరోయిన్. అమెరికా నుండి ఇండియా వచ్చిన స్టైలిష్ ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


