రాజమౌళి వల్ల నాకు నటుడిగా గౌరవం దక్కింది – సుధీప్

రాజమౌళి వల్ల నాకు నటుడిగా గౌరవం దక్కింది – సుధీప్

Published on Apr 15, 2014 2:29 PM IST

sudeep
కన్నడలో సూపర్ స్టార్ అయిన కిచ్చ సుదీప్ కేవలం నటుడే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. కన్నడలో బాగా ఫేం ఉన్న సుధీప్ కి ‘రన్’, ‘రక్త చరిత్ర’ సినిమాలతో హిందీలో పేరు వస్తే, తెలుగు, తమిళంలో ‘ఈగ’ సినిమా ఎక్కడలేని క్రేజ్ ని తెచ్చి పెట్టింది.

తెలుగులో తనకి ఇంత క్రేజ్ రావడానికి, తన నటనకి మంచి పేరు రావడానికి కారణం మాత్రం రాజమౌళినే అని సుధీప్ అంటున్నాడు. ‘నాకు ‘ఈగ’ సినిమా ఇచ్చినందుకు రాజమౌళికి థాంక్స్ చెప్పాలి. ప్రేక్షకులలో నటుడిగా నాకు గౌరవాన్ని పెంచిన సినిమా ‘ఈగ’. మళ్ళీ రాజమౌళితో చేయనున్న ‘బాహుబలి’ షూటింగ్ ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఆసక్తి ఎదురు చూస్తున్నానని’ సుధీప్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు