‘ENE2’ రిలీజ్ డేట్‌పై తరుణ్ భాస్కర్ క్లారిటీ.. ఎప్పుడంటే..?

‘ENE2’ రిలీజ్ డేట్‌పై తరుణ్ భాస్కర్ క్లారిటీ.. ఎప్పుడంటే..?

Published on Feb 9, 2026 7:05 PM IST

ENE-2

డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు మరో ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు. కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ‘గాయపడ్డ సింహం’ సినిమాలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైజర్ రిలీజ్ ఈవెంట్‌లో పొల్గొన్న తరుణ్ భాస్కర్ తన డైరెక్షన్‌లో రాబోతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ క్రేజీ సీక్వెల్ చిత్రం షూటింగ్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యిందని.. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ జరగబోతుందని ఆయన తెలిపారు. అంతేగాక, ఈ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తరుణ్ భాస్కర్ ప్రకటించారు.

దీంతో ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు