ప్రమోషన్లను వేగవంతం చేస్తోన్న ‘తరువాత ఎవరు’ చిత్రబృందం !
Published on Aug 2, 2018 4:17 pm IST

రాజేష్ కొండూరు దర్శకత్వంలో మనోజ్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కతున్న చిత్రం ‘తరువాత ఎవరు’. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

కాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గుంటూరులోని ఏపీ9 ఎఫ్.ఎమ్ ఛానల్ లో ఈ రోజు చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా తమ చిత్రానికి సంబంధించిన విశేషాలను మీడియా ద్వారా పంచుకుంది. ఐతే మంచి కథాంశంతో చక్కని స్క్రీన్ ప్లే తో దర్శకుడు రాజేష్ కొండూరు ఈ చిత్రాన్ని మలిచారని తెలుస్తోంది. చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో సాయి కిరణ్ నటిస్తున్నాడు. కాగా రాజేష్ కొండూరు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook