ఆ దర్శకుడి శిషులు సక్సెస్ అయ్యారు !

1st, April 2018 - 01:00:19 PM

ఆ నలుగురు సినిమాతో రచయితగా పరిచయం అయిన మదన్ ఆ సినిమా తరువాత జగపతిబాబుతో పెళ్ళైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా మారారు. తాజాగా ఈ డైరెక్టర్ దర్శకత్వం వహించిన గాయత్రి సినిమాతో మంచి విజయం సాధించాడు. త్వరలో ఈ డైరెక్టర్ ఒక టాప్ హీరోతో సినిమా చెయ్యబోతున్నాడు. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.

మదన్ దగ్గర వర్క్ చేసిన విరించి వర్మ దర్శకుడిగా మారారు. ఈ డైరెక్టర్ తీసిన ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు మంచి విజయాలు సాధించాయి. త్వరలో ఈ డైరెక్టర్ కళ్యాణ్ రామ్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. తాజాగా నీది నాది ఒకే కథ సినిమాతో సక్సెస్ అయిన దర్శకుడు వేణు ఉడుగుల గతంలో మదన్ దగ్గర వర్క్ చెయ్యడం జరిగింది. త్వరలో వేణు ఉడుగుల మరో సినిమాతో ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. మదన్ దగ్గర వర్క్ చేసిన ఇద్దరు యువ దర్శకులు ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు.