అది కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కబోతోంది !
Published on Mar 4, 2018 5:44 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తోన్న సాక్షం సినిమా ఈ ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మొదటిసారి పూజా హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించే సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ మూవీ ఒక కిడ్నాప్ డ్రామాగా తెలుస్తోంది. సినిమా మొత్తం ఒక కిడ్నాప్ చుట్టూ తిరుగుతుందని సమాచారం.

 
Like us on Facebook