ఆ సినిమా కొత్త విడుదల తేది ప్రకటించారు !

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కీర్తిసురేష్ సావిత్రి పాత్ర పోషిస్తుంది. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొదట మర్చి లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. కాని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడింది.

ఉగాది సందర్భంగా ఈ చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదిని ప్రకటించారు. మే 9న సినిమా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని పోస్టర్ విడుదల చెయ్యడం జరిగింది. మూడు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాణిగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన సావిత్రి కథను సినిమాగా తెరకెక్కించబోతుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను ప్రటిస్తాత్మకంగా నిర్మిస్తున్నారు.