ఆ హీరోయిన్ నారా రోహిత్ భార్య పాత్రలో కనిపించబోతోందా?
Published on Mar 5, 2018 9:55 am IST

తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోతున్న సినిమాకు ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వెంకటేష్ తో జోడిగా శ్రియ ఈ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు హీరోయిన్ ఇషా రెబ్బ ఈ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది. నారారోహిత్ కు భార్య పాత్రలో ఇషా కనిపించబోతుందట.

ఈ నెల 12నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రామానుజం సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ఫినిష్ చేసి ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు యూనిట్ మెంబెర్స్. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

 
Like us on Facebook