టాక్..”బాలయ్య 108″కి ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్.?

టాక్..”బాలయ్య 108″కి ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్.?

Published on Dec 8, 2022 11:46 PM IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా “వీరసింహా రెడ్డి” అనే సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే షూటింగ్ కంప్లీట్ అవ్వగానే బాలయ్య తన కెరీర్ 108వ సినిమాని కూడా షురూ చేసేసారు. మరి ఘనంగా ఈ చిత్రం ముహూర్తంతో ఆరంభం కాగా ఈ చిత్రం టైటిల్ కూడా ఈరోజే వస్తుంది అని కొన్ని రూమర్స్ మొన్న వచ్చాయి. అయితే దీనిపై మాత్రం మేకర్స్ ఎలాంటి అప్డేట్ ని ఇవ్వలేదు.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన మొదట్లో ఓ క్రేజీ టైటిల్ అని అందులోని మంచి స్టైలిష్ టైటిల్ “బ్రో ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ని లాక్ చేసినట్టుగా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అన్నట్టుగా సీన్ వర్గాలు చెప్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు