‘రజనీ – కమల్’ సినిమా నుంచి అందుకే తప్పుకున్నాడట !

‘రజనీ – కమల్’ సినిమా నుంచి అందుకే తప్పుకున్నాడట !

Published on May 4, 2026 1:00 PM IST

Thalaivar 173

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్‌ హాసన్‌ కలిసి ఓ సినిమా చేస్తే.. చూడాలని ఎంతో మంది అభిమానులు దశాబ్దాలుగా ఆశ పడుతున్నారు. వారందరి ఆశకి ‘తలైవార్‌ 173’ (వర్కింగ్‌ టైటిల్‌)తో గతేడాదే మంచి తీపి కబురు అందింది. పైగా ఈ సినిమాకి సుందర్‌.సి దర్శకత్వం వహిస్తారని అప్పట్లోనే వెల్లడించారు. కానీ, ఏమైందో ఏమో.. ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే సుందర్‌.సి ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. సడెన్ గా సుందర్‌.సి ఎందుకు తప్పుకున్నారో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుందర్‌.సి మాట్లాడుతూ.. ‘రజనీ – కమల్’తో ఓ సినిమా చేయడం అంటే.. అది అద్భుతం. కానీ, అది మామూలు విషయం కూడా కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది. నేను ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. నిజం చెప్పాలంటే.. గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ వస్తున్నాను. కానీ ఇంత భారీ ప్రాజెక్టును హ్యాండిల్‌ చేసే క్రమంలో నా ఆలోచనలను ఇతరులకు వివరించి ఒప్పించలేను అనిపించింది. నాకు కథను అద్భుతంగా నెరేట్‌ చేయడం రాదు. ఆ ఇద్దరు లెజెండ్స్‌కు నేను పూర్తి న్యాయం చేయలేనని.. ఆ సినిమా నుంచి తప్పుకున్నాను’ అని సుందర్‌.సి తెలిపారు.

తాజా వార్తలు