చరణ్ కి మెగాస్టార్ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏమిటో తెలుసా?

Published on Oct 8, 2019 9:27 am IST

మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులుగా పుత్రోత్సహంతో పొంగిపోతున్నారు. తన జీవితంలోనే గొప్ప సినిమాగా నిలిచిపోనున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించిన రామ్ చరణ్ ని ఆయన పొగడ్తలతో ముంచేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి మూవీ తీసిన చరణ్ కానుకకు చిరు ముద్గుడైపోతున్నారు. కాగా మరి ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన చరణ్ కి చిరంజీవిగా మీరేమి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అడుగగా, వాడికి నేను జన్మనిచ్చాను అంత కంటే పెద్ద బహుమతి ఏముంటుంది అన్నారు. చిరంజీవి కొడుకుగా పుట్టడమే అతిపెద్ద బహుమతి, చరణ్ కి ప్రత్యేకంగా ఏమి ఇవ్వాలి అని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు.

ఐతే చరణ్ నేను తన వెనకున్నానే ధైర్యం తోనే అన్ని కోట్లు ఖర్చుపెట్టాడని చిరు మాటల్లో మాటగా అసలు విషయం బయటపెట్టారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరంజీవి 152వ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. ఈ చిత్రానికి కూడా నిర్మాతగా చరణ్ వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More