బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పైగా ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఐతే, రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘ఎప్పటి నుంచో నా పై ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తూ వస్తున్నారు. నేను రాజకీయ నాయకురాలిగా ఉన్నప్పటికీ.. ఆ విమర్శలు నన్ను వదలడం లేదు. కానీ, హిందీ సినీరంగంలో నా దశాబ్దాల కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ఎదుగుదలకు మనసుకు హత్తుకునే కథలే ముఖ్య కారణం. నా కెరీర్ లో అలాంటి కథలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అందుకే, నేను నటీనటుల కంటే పాత్రలే గొప్పవి అని నమ్ముతాను.
ఐతే, అలాంటి గొప్ప పాత్రలు మన దగ్గరకు రావడానికి ఎంతో సహనం, ఓర్పు అవసరం. ప్రధానంగా కొన్ని స్టార్ల రొటీన్ సినిమాలకు ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. ఈ క్రమంలో ఎంతోమందికి మనం టార్గెట్ అవ్వొచ్చు. ఒక్కోసారి వాళ్ళు మనకు దక్కాల్సిన సినిమాలను కూడా మనకు రాకుండా చేయొచ్చు. అయినా, నచ్చని కథలను దూరంగానే పెట్టాలి. అప్పుడే.. రెగ్యులర్ హీరోయిన్ లిస్ట్ లో ఏ హీరోయిన్ ఉండదు. నేను నా కెరీర్ ను అలాగే బిల్డ్ చేసుకున్నాను’ అంటూ కంగనా రనౌత్ తెలిపింది. సహజంగా విమర్శలు చేసే అలవాటు ఉన్న కంగనా.. ఇలాంటి కామెంట్స్ చేయడంతో.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


