‘లెనిన్’ విడుదల వాయిదాకి కారణం అదే !

‘లెనిన్’ విడుదల వాయిదాకి కారణం అదే !

Published on Jun 14, 2026 7:00 AM IST

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఐతే, ఈ సినిమా రిలీజ్ జులై 10వ తేదీకి పోస్ట్ ఫోన్ అయిన సంగతి తెలిసిందే. సడెన్ గా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అందుకు ప్రధాన కారణం.. క్లైమాక్స్ సీన్స్ రీషూట్ అని తెలుస్తోంది. నాగార్జున సలహాలకు అనుగుణంగా క్లైమాక్స్ లో కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ ను రీషూట్ చేస్తున్నారట. అన్నట్టు ఈ షూట్ లో అఖిల్ తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట.

కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు