నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలనేది ప్రతి తెలుగువాడి కోరిక అంటూ బాలయ్య బాబు చెప్పుకొచ్చారు. ఇటీవల పద్మభూషణ్ అందుకున్న తనను హిందూపురంలో సన్మానించిన సందర్భంగా బాలయ్య మాట్లాడారు. ఇంతకీ, బాలయ్య ఏం మాట్లాడారు అంటే.. ‘నాకు ఆర్టిస్ట్‌గా పద్మభూషణ్ ఇవ్వడం సంతోషం. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చినప్పుడే కేంద్రం వాళ్లను వాళ్లు గౌరవించుకున్నట్లు అని గుర్తు చేస్తున్నా. అతి త్వరలోనే ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక’ అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు.
నందమూరి బాలకృష్ణ తనకు పద్మ భూషణ్ అవార్డు ఇవ్వడం ఫై మాట్లాడుతూ.. ‘నాకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దీన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను’ అని బాలయ్య తెలిపారు. బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఉమ్మడి ఏపీ మాజీ సీఎంగా, దివంగత నటుడిగా ఎన్టీఆర్ ఎన్నో సేవలు చేశారు. అలాంటి మహనీయుడికి ‘భారతరత్న’ ఇవ్వాలి’ అని నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
