అందుకే తనంటే అంటే నాకిష్టం-తమన్నా

అందుకే తనంటే అంటే నాకిష్టం-తమన్నా

Published on Jun 5, 2020 10:24 PM IST

ShrutiHaasan

మిల్కీ బ్యూటీ తమన్నా తనకు శృతి హాసన్ అంటే ఎంత ఇష్టమో చెప్పింది. పరిశ్రమలో శృతి కి మించిన మిత్రులు తనకు లేరని ఆమె చెప్పుకొచ్చింది. తోటి హీరోయిన్స్ లో మీకు ఇష్టమైనవారు ఎవరని అడుగగా తమన్నా ఇలా చెప్పింది. ”ఇండస్ట్రీలో నాకు శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. ముంబైలో మా ఇంటి దగ్గరనే తన ఇల్లు ఉంటుంది. తను ముంబై వచ్చినప్పుడు కలుసుకుంటూ ఉంటాం. కలుసుకున్నప్పుడు మా జీవితాల గురించి మాట్లాడుకుంటుంటాం. శ్రుతికి నెగెటివిటీ అంటే నచ్చదు. అందువల్లనే మేంఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఇప్పటికీ తను నన్ను ఓ చిన్న పిల్లలా చూస్తుంది” అని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా తమన్నా అడపాదడపా అవకాశాలతో ముందుకు వెళుతుంది. తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మీ మరియ్ గోపి చంద్ సరసన సీటీమార్ మూవీలో కూడా నటిస్తుంది. అలాగే ఓ హిందీ చిత్రంలో కూడా తమన్నా నటించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు