ప్రభాస్ 20 లో ఆ నటుడు కీలక పాత్ర.?

ప్రభాస్ 20 లో ఆ నటుడు కీలక పాత్ర.?

Published on Jun 2, 2020 8:58 PM IST


ప్రస్తుతం డార్లింగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తన 20వ చిత్రం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి అధికారికంగా ఒక్క అప్డేట్ వస్తే చాలు అదే ఎక్కువ అని అనుకుంటున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వినిపిస్తుంది.

ఈ చిత్రంలో ఓ ప్రముఖ సీనియర్ నటుడు కనిపించనున్నారని తెలుస్తుంది. తమిళ్ మరియు మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన జైరాం ఓ కీలక పాత్రలో నటించనున్నారట. జైరాం లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురములో” చిత్రంలో మంచి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ సినిమాలో ఎలాంటి రోల్ పోషిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు