‘ఎఫ్ 3’లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ అదే !

‘ఎఫ్ 3’లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ అదే !

Published on Apr 4, 2021 10:03 PM IST

ఒకప్పటి కామెడీ స్టార్ సునీల్ కి చాల కాలం తరువాత ‘ఎఫ్ 3’లో మంచి క్యారెక్టర్ దొరికిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో ఓ కామెడీ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో సునీల్ నటించబోతున్నాడని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి సినిమా అనగానే మంచి కామెడీ రోల్ ఉంటూనే ఉంది. కాగా ఆ మధ్య ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సునీల్ తో పాటు వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయట. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొడుతూ… ఈ క్రమంలో చేస్తోన్న సినిమా ‘ఎఫ్ 3.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు