‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్స్ !

Published on Oct 30, 2018 2:59 pm IST

‘బాహుబలి’ చిత్రం తో దేశవ్యాప్తంగా గుర్తింపును పొంది తెలుగు సినిమా స్థాయిని నలుమూలల విస్తరింపజేశారు దర్శకుడు రాజమౌళి. దాంతో ఆయన తరువాత ఎలాంటి సినిమా తీస్తాడని అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే రాజమౌళి ఇద్దరు టాలీవుడు అగ్ర హీరోలు ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఇక ఈ చిత్రం అధికారకంగా వచ్చే నెల 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అదే రోజు రాజమౌళి ఈచిత్రం ఏ నేపథ్యంలో సాగుతుందో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ చిత్రం యొక్క రెగ్యూలర్ షూటింగ్ నవంబర్ 18నుండి ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి అవసరమైన భారీ సెటింగ్స్ ను ప్రముఖ స్టూడియో లో నిర్మించారు. ఈ చిత్రంలో ముగ్గురు నాయికలు ఉంటారని సమాచారం ఆ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. దానయ్య డీవీవీ నిర్మిస్తున్న ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :