ఈ సంవత్సరం చిన్న సినిమాల్లోనే బిగ్గెస్ట్ సినిమా ఇది – రానా

ఈ సంవత్సరం చిన్న సినిమాల్లోనే బిగ్గెస్ట్ సినిమా ఇది – రానా

Published on Aug 15, 2018 4:00 PM IST


వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్ కంచెర పాలెం’ అనే చిన్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల అవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం రానా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ.. కంచెర పాలెం ఈ సంవత్సరం చిన్న సినిమాల్లోనే బిగ్గెస్ట్ సినిమా అని పోస్ట్ పెట్టారు.

కాగా కేరాఫ్ కంచెరపాలెం ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచుతుంది. సినీ లవర్స్ కూడా ఈ సినిమా పై చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. విశాఖపట్నంలోని కంచరపాలెం అనే ప్రాంత నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో ఆక్కడి నలుగురి వ్యక్తులకు సంబందించిన కథల్ని చెప్పారు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు