‘కాస్ట్‌ కౌచింగ్‌’ మగవారికి కూడా ఉందన్న ‘సూపర్ స్టార్’ !

‘కాస్ట్‌ కౌచింగ్‌’ మగవారికి కూడా ఉందన్న ‘సూపర్ స్టార్’ !

Published on Jun 11, 2018 7:20 PM IST

sal

తెలుగు సినిమాల్లో ఇప్పుడు ప్రముఖంగా కనిపిస్తున్న విలన్ ఎవరంటే ముఖ్యంగా వినిపించే పేరు రవికిషన్. ‘రేసుగుర్రం’ చిత్రం దగ్గరనుంచీ మొన్నటి ‘ఎమ్ ఎల్ ఎ’ చిత్రం వరకు ఎన్నో విలక్షణమైన విలన్ పాత్రలను పోషించిన ఈయన బోజ్‌పూరీ భాషలో ‘సూపర్ స్టార్’ అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ‘రవికిషన్’ ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాస్ట్ కౌచింగ్‌’ అనేది అన్ని సినీ పరిశ్రమల్లో ఉందని, ఇది కేవలం ఆడవారి ఒక్కరికే కాదు, మగవారికి కూడా ఈ ఈ సమస్య ఎదురవుతోందని రవికిషన్ అన్నారు. హీరోయిన్లలో కొంతమంది మగవారిని లైంగికంగా వేధిస్తున్నారని.. కాస్ట్ కౌచింగ్‌ వల్ల మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటున్నాయని ఈ బోజ్‌పూరీ ‘సూపర్ స్టార్’ పేర్కొన్నారు.

తాజా వార్తలు