వీక్ డేస్ లో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ‘ది ఎండ్’

వీక్ డేస్ లో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ‘ది ఎండ్’

Published on Dec 9, 2014 7:17 PM IST

The-End-Telugu-Movie-Review
2014లో టాలీవుడ్ లో అప్పుడప్పుడు కొత్త టాలెంట్ మెరిసిందనే చెప్పాలి. చాలా మంది తన కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు. అలా ఈ సంవత్సరం చివర్లో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ‘ది ఎండ్’ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి వీక్ ఎండ్ లోనే కాకుండా వీక్ డేస్ అయిన సోమ, మంగళ వారాల్లో కూడా థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి.

ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ మాట్లాడుతూ ‘మేము ఊహించిన దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే థియేటర్స్ కూడా పెరిగాయి. వారంతం కంటే వీక్ డేస్ లో యువత ఎక్కువగా థియేటర్స్ కి వస్తున్నారు. రేపటి నుంచి ఈ సినిమా ఇంత పెద్ద విజయం చేసిన ఆడియన్స్ కి థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ వేస్తున్నామని’ తెలిపాడు. యువ చంద్ర, సుధీర్ రెడ్డి, పావని రెడ్డి, గజల్ సోమయ్య నటించిన ఈ సినిమాకి వంశీ – హరి మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు