‘ది ఎండ్’ ట్రైలర్ ఆవిష్కరించిన కోన వెంకట్.
Published on Nov 1, 2014 3:48 pm IST

THE-END
సుధీర్ రెడ్డి, యువచంద్ర హీరోలుగా రాహుల్ సంక్రితియన్ దర్శకత్వంలో రూపొందిన హారర్ సినిమా ‘ది ఎండ్’. ఫ్రైడే ఫిల్మ్స్ పతాకంపై కోటేశ్వరరావు నిర్మించారు. శనివారం ఉదయం ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ రచయిత కోన వెంకట్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ… ప్రస్తుతం లో బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది. 40 సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన నాకు లో బడ్జెట్ తో నిర్మించిన ‘గీతాంజలి’ సంతోషాన్ని ఇచ్చింది. లో బడ్జెట్ సినిమాలలో వర్క్ శాటిస్ ఫ్యాక్షన్ ఉంటుంది. 100 శాతం క్రియేటివిటీ చూపించే అవకాశం కలుగుతుంది. యంగ్ టీం అంతా కలసి రూపొందించిన ‘ది ఎండ్’ సినిమా గ్రేట్ బిగినింగ్ కావాలని ఆశిస్తున్నారు అని అన్నారు.

మాతో పరిచయం లేకపోయినా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి విచ్చేసిన కోన వెంకట్ గారికి కృతజ్ఞతలు అని దర్శకుడు రాహుల్ సంక్రితియన్ అన్నారు. డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో సినిమా తీశాం. సినిమా అద్బుతంగా వచ్చింది. నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని నిర్మాత కోటేశ్వరరావు అన్నారు.

 
Like us on Facebook