ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన హీరో, మళ్ళీ బిజీ అవుతున్నాడు !
Published on Jun 16, 2018 12:38 pm IST

ఒకప్పుడు వరుస సినిమాలతో హిట్లు కొట్టిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు. సినిమా సినిమాకి కొంత విరామం తీసుకుంటున్న ఈ కామెడీ హీరో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయనున్నాడు. నరేష్ ఇప్పటికే భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ తో కలిసి ‘సిల్లీ ఫెలోస్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణంలో ఏ.కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఆ చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా పూజా ఝావేరి నటిస్తోంది. పూజా గతంలో విజయ్ దేవరకొండ సరసన ద్వారకా చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఆమె ’47 డేస్’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. దర్శకుడు గిరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇది ఆయనకు రెండో చిత్రం. ‘సీనియర్ నరేష్’ కుమారుడు నవీన్ నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో గిరి దర్శకుడిగా పరిచయం అయ్యారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook