వినూత్నంగా సేవ చేస్తోన్న హీరోయిన్ !

Pranita
‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన బాపు బొమ్మగా మెరిసిన ప్రణీత.. తన రూపమే కాదు, తన మనసు కూడా ఎంతో అందమైనదని ఓ సేవ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేక అక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాగా ప్రణీత తన తండ్రి పుట్టి పెరిగిన ఆలూరులోని ఆ పాఠశాలను చూసి.. తన సొంతూరికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో.. ఎలాంటి సదుపాయాలు లేని అక్కడి పాఠశాలను దతత్త తీసుకుని అక్కడి పాఠశాలను బాగు చేశారు.

తాజాగా ప్రణీత ఆ పాఠశాలకు ఐదు లక్షల రూపాయలతో కనీస సౌకర్యాలు కల్పించారు. మరుగుదొడ్డి నిర్మించడంతో పాటుగా విద్యార్థుల తరగతి గదులకు మరమ్మత్తులు చేయించారు. మొత్తానికి ప్రణీత చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి, ఆమెను అందరూ అభినందిస్తున్నారు.

Exit mobile version