ఇటీవల ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించిన తెలుగు సినిమాలలో ‘గోపాల గోపాల’ ఒకటి. ‘మనిషేమో రాయిని కూడా దేవుడిని చేస్తున్నాడు, కనీసం ఆ దేవుడు మనుషుల్ని మనిషిగా చేస్తే చాలు’.. ‘నువ్వు దేవుడికి దూరంగా ఉంటే.. ఆ దేవుడికి ఎలా దగ్గరవుతావు’.. ‘నువ్వు దేవుడికి దూరంగా ఉంటే.. ఆ దేవుడికి ఎలా దగ్గరవుతావు’.. వంటి డైలాగులు ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. స్టార్ హీరోలయిన వెంకటేష్, పవన్ కళ్యాణ్ ల చేత మానవత్వ విలువలు, ఆధ్యాత్మిక తర్కాన్ని చెప్పించిన తీరు ప్రశంసనీయం. థియేటర్లో ప్రేక్షకులు మాటల రచయిత ఎవరో భలేగా రాశారు అని మాట్లాడుకున్నారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫేం సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాలో డైలాగులను రాశారు.
ప్రేక్షకుల నుండి వస్తున్న ప్రశంసలు చాలా సంతోషాన్ని కలిగించాయని మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా తెలిపారు. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అర్ధవంతంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మాటల రచయితగా తొలి సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో కూడా ఈ రచయిత సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయి. అప్పుడు, ఇప్పుడు మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రా సూపర్ సక్సెస్ అయ్యారు. త్వరలో విడుదల కానున్న ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో ఈ రచయిత కలం నుండి జాలువారిన మాటలను వినొచ్చు.


