పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన “ది ఇండియా హౌస్”

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన “ది ఇండియా హౌస్”

Published on Jul 1, 2024 10:01 PM IST

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. స్పై చిత్రంలో చివరిసారిగా కనిపించిన ఈ హీరో, తదుపరి స్వయంభు చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. నేడు హంపి, విరూపాక్ష దేవాలయం లో నిఖిల్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ ఎంపిక అయ్యింది. ఈ హీరోయిన్ ఇప్పటికే గని, మేజర్, స్కంద చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ ప్రధాన భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు