`ట‌క్ జ‌గ‌దీష్`లో అదే మెయిన్ హైలైట్ అట !

Published on Mar 1, 2021 1:05 pm IST

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ ‘ట‌క్ జ‌గ‌దీష్`. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ గురించి ఒక అప్ డేట్ తెలిసింది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్, మెయిన్ గా బ్రదర్ సెంటిమెంట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ సినిమాలో తారాగ‌ణం: నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :